వైసీపీ అధినేత జగన్ పాదయాత్రం విశాఖజిల్లాలో కొనసాగుతోంది. ఇక్కడి 9 మండలాలు, 149 గ్రామాలకు జీవనాధారంగా ఉన్న తుమ్మపాల చక్కెర ఫ్యాక్టరీని తెరిపించి తమను ఆదుకోవాలని రైతులు, సహకార, ఉద్యోగ సంఘాల నేతలు తుమ్మపాలలో జగన్‌కు వినతి పత్రాలు అందజేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ తమకీ కష్టాలు తప్పడం లేదని ఫిర్యాదు చేశారు. 42 నెలలుగా కర్మాగారంలో పని చేస్తున్న కార్మికులు ఆకలిదప్పులతో అలమటిస్తున్నారని వారంతా కన్నీళ్ల పర్యంతమయ్యారు. ప్రావిడెంట్ ఫండ్‌ను తమ ఖాతాల్లో జమ చేయకపోవడంతో చనిపోయిన వారి కుటుంబాలకు, రిటైర్ అయిన వారికి పెన్షన్ రావడం లేదనివాపోయారు. ఈ ఫ్యాక్టరీని తెరిపించకపోతే 300 కార్మిక కుటుంబాలు, 14 వేల రైతు కుటుంబాలు బజారు పాలవుతాయన్నారు. దీనిపై జగన్ బహిరంగ సభలో స్పందిస్తూ మనందరి ప్రభుత్వం రాగానే ఆ ఫ్యాక్టరీని తెరిపించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామనన్నారు. అంతేకాదు నేను హామీ ఇస్తున్నాను కచ్చితంగా ఆఫ్యాక్టరీని తెరిపిస్తానంటూ జగన్ హామీ ఇచ్చారు