ఎన్టీరామారావు కుమారుడు హరికృష్ణకు రాజకీయాలు, ప్రజాసేవ అంటే ఎంతో ఆసక్తి. అయితే చంద్రబాబు రాజకీయ చాణక్యతతో హరికృష్ణ రాజకీయాల్లో ఎదిగితే తనకు ఇబ్బందులొస్తాయని రాజకీయంగా హరికృష్ణను క్రియాశీలకం కాకుండా చేసారనేది బహిరంగ విమర్శే.. తెలుగుదేశం పార్టీ సంస్థాపకుడికి కుమారుడవడంతోపాటు ఆపార్టీ రథసారధిగా పార్టీ ఆవిర్భావంలో కీలకపాత్ర వహించినా, ఆయన ఎన్టీయార్ రాజకీయ వారసుడు కాలేకపోయాడు. ఎంత కష్టపడ్డాడో అంత వెనక్కి నెట్టివేయబడ్డారు. ఎప్పుడూ రెబెలేగాని కుటుంబపరమైన ఇబ్బందులు తనవల్ల రాకూడదని మిన్నకుండిపోయారు హరికృష్ణ. ఆయనకు ఎన్టీయార్ పోలికలు చాలా ఎక్కుని, సినిమాల్లో డైలాగులు ఆయన అచ్చం ఎన్టీయార్ లాగా చెబుతారని అంతా అంగీకరించినా, సినిమాల్లో కూడా ఆయన వారసుడు కాలేకపోయాడు.
అలాగే, రాజకీయాల్లో ఎన్నో పోలికలున్నా ఆయన వారసుడు కాలేకపోయాడు. కానీ ఎప్పుడూ ఆయన బహిరంగ తిరుగుబాటు చేయలేదు. ఎప్పుడైనా ఆగ్రహోదగ్రుడయినా మళ్లీ ఆయనే రాజీకొచ్చేవారు. తెలుగుదేశం నాయకత్వం మీద ఎంతో సంతృప్తి ఉన్నా ఆయన పార్టీకి హాని చేసేవిధంగా ఎపుడూ ప్రవర్తించలేదు. ఎన్టీరామారావుకు ఆశయాలకు వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నపుడు మాత్రం ఆయన విబేధించేందుకు వెనకాడలేదు. చంద్రబాబు వెన్నుపోటు సమయంలో పార్టీ ప్రయోజనాలకోసం నిలబడ్డారు. అప్పుడు పార్టీని నడపగల శక్తి తండ్రికి లేదని, చంద్రబాబు నాయుడే నడపగలరని నమ్మించారు. ఆసమయంలోనూ పార్టీ నిలబడడానికి అంగీకరించారే తప్ప వారసత్వం తనకు దక్కాలని గొడవ చేయలేదు. తిరుగుబాటు సమయంలో తప్పనిసరిస పరిస్థితుల్లో చంద్రబాబు నాయకత్వాన్ని సమర్థించారు.
ప్రతిఫలంగా 1995లో చంద్రబాబు క్యాబినెట్ మంత్రి అయినా ఎక్కువకాలం చంద్రబాబుతో ఉండలేదు. ఆ అసంతృప్తితోనే బావ చంద్రబాబుతో విబేధించారు. 1999 జనవరి 26 న ఆయన ‘అన్నా టిడిపి’ అని కొత్త పార్టీ పెట్టారు. 1999 ఎన్నికల్లో పోటీ చేసినా హరికృష్ణ పార్టీకి ఒక్కసీటు కూడా రాలేదు. చంద్రబాబు నాయుడితో గొడవకు దిగారు. నాయుడు ఎన్టీయార్ వారసత్వం లేకుండా నాశనం చేస్తున్నారని ఆరోపించారు. సోదరుడు నందమూరి బాలకృష్ణ పూర్తిగా చంద్రబాబు నాయుడితో కలసి పోతే, హరికృష్ణ ఎపుడూ అలా టిడిపిలో ఒదిగి పోలేకపోయారు. కానీ పార్టీకి నష్టం చేకూర్చలేదు. కొద్ది రోజుల తర్వాత ఆయన అన్నా టిడిపిని మూసేసి టిడిపికి దగ్గరయ్యారు. తర్వాత ఆయన రాజ్యసభ నామినేషన్ వచ్చింది. దానిని కూడా సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో రాజీనామా చేసారు. చనిపోయే నాటికి ఆయన టిడిపి పాలిట్ బ్యూరో సభ్యుడిగా అన్నారు.
అయితే, ఆయనెపుడూ పార్టీ సమావేశాల్లో పాల్గొన్న దాఖలాలులేవు. చాలా సమావేశాలకు ఆయనను పిలవడం మానేసారు. మహానాడుల్లో కూడా ఆయన ఉండేవారు కాదు ఇది నిజంగా దారుణం. తెలుగుదేశం పార్టీలో ఉన్నా అంటీఅంటనట్లుగానే ఉంటూ వచ్చారు. చనిపోయే నాటికి కూడా అదే పరిస్థితి. ఒకప్పుడు టిడిపిలో ఉండి బయటపడిన చంద్రబాబు వ్యతిరేకులే ఆయన చుట్టు కనిపించే వారు. టిడిపి నుంచి బయటకు వెళ్లిన కొడాలినాని వంటి వారితో కూడా హరికృష్ణ సత్సంబంధాలు కొనసాగి ఇది చంద్రబాబుకు నచ్చేది కాదట.. మొత్తంగా ఆయన బ్రతికున్నపుడు పార్టీపరంగా, రాజకీయంగా చంద్రబాబు అన్నిరకాలుగా అన్యాయం చేసి చనిపోయాక మృతదేహం వద్ద ఆయన ప్రేమ చూపించారు. వైసీపీ నెటిజన్లు ఈ అంశాలపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ఏ పార్టీలో అయితే ఆయనను అణగదొక్కేందుకు ప్రయతనించారో అదేపార్టీ జెండాను ఆయన భూతికకాయంపై కప్పడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం పదవులు, అధికారాలు వేరే ఎవరైనా అనుభవించవచ్చు కానీ పార్టీకోస్ రాత్రింబవళ్లూ కష్టించి పనిచేసి గెలిపించింది హరికృష్ణే అనే వాస్తవ సత్యాలపు ఎవరూ మర్చిపోరు.