చంద్రబాబునాయుడు రాజకీయంగా నందమూరి హరికృష్ణ పట్ల వ్యవహరించిన విధానానికి ఆ కుటుంబం ముఖ్యంగా కుమారుడు ఎన్టీఆర్ లో ఉన్న కోపం ఇపుడు బయటపడిందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రోడ్డుప్రమాదంలో హరికృష్ణ తర్వాత భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులకు అందచేశారు. భౌతికకాయాన్ని కొద్దిసేపు ఇంట్లో ఉంచి తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు తీసుకొస్తారని పార్టీ నేతలంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఇక్కడే అసలు సమస్య మొదలైందట.. ముందుగా హరికృష్ణ భౌతికకాయాన్ని మెహదీపట్నంలోని ఆయన ఇంటినుంచి బంధువులు, సన్నిహితల సందర్శన తర్వాత పార్ధివదేహాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు తీసుకెళ్ళాలని కుటుంబసభ్యులకు పార్టీ నేతలు సూచించారు. అందుకు కుటుంబసభ్యులు నిరాకరించారట.. తర్వాత కూడా కొందరు నేతలు, ముఖ్యంగా చంద్రబాబు కూడా ఒకటికి రెండు సార్లు సూచించినా కుటుంబసభ్యులు పూర్తిగా వ్యతిరేకించారట.. చంద్రబాబు అడగడంతో జూనియర్ ఎన్టీఆర్ కళ్లల్లో బాధతోపాటు కోపం కనిపించిందట.. జూనియర్ ఎందుకంత తీవ్రంగా వ్యతిరేకించారంటే ఎన్టీఆర్ మరణం తర్వాత రాజకీయంగా హరికృష్ణను పూర్తిగా అణగదొక్కేసింది చంద్రబాబేనన్న విషయం అందరికీ తెలుసు. ఎమ్మెల్యే కాకుండా మంత్రి అయితే ఆరుమాసాల్లో ఎక్కడో ఒకచోట నుండి ఎమ్మెల్యే అవ్వాలి. లేకుంటే ఎమ్మెల్సీ సభ్యుడన్నా అవ్వాలి. లోకేశ్ మాదిరిగా.. కానీ హరికృష్ణకు మంత్రిపదవి ఇచ్చినట్లే ఇచ్చి ఆరుమాసాల్లో ఉభయ సభల్లో ఎందులోనూ సభ్యత్వం కల్పించక పోవటంతో హరికృష్ణ రాజీనామా చేయాల్సివచ్చింది. దానికి చంద్రబాబే కారణమంటూ అప్పట్లో హరికృష్ణే చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. మళ్ళీ హరికృష్ణకు ఎంఎల్ఏ టిక్కెట్టు ఇవ్వలేదు, మంత్రిని చేయలేదు. పార్టీ సమావేశాలకు పిలవలేదు.. ముఖ్యమైన నిర్ణయాలప్పుడు సంప్రదించలేదు.. పార్టీకోసం రాత్రింబవళ్లూ కష్టించి పనిచేసి గెలిపించిన హరికృష్ణను పూర్తిగా పక్కన పెట్టడం పట్ల ఆయన కుటుంబానికి ఆగ్రహం ఉంది. తనతండ్రిని ఆవిధంగా చేయడం పట్ల కచ్చితంగా జూనియర్ కు కోపం ఉందట ఈ కారణంతోనే జూనియర్ వ్యతిరేకించారట.
Home / 18+ / మాజీ ఎంపీ, టీడీపీ వ్యవస్థాపకుని కొడుకు, పొలిట్ బ్యూరో సభ్యుడు చనిపోతే ఎన్టీఆర్ భవన్ కు ఎందుకు తీస్కెళ్లలేదు..
Tags ap cm chandrababunaidu hari krishna ntr bhavan