మన బౌలర్స్ అదరహో అనిపించారు.గురువారం జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.అయితే ఇంగ్లండ్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.రెండో ఓవర్ మొదటి బంతికే ఓపెనర్ కీటన్ జెన్నింగ్స్(0) డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత భారత బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది.ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 246పరుగులకు అల్లౌట్ అయింది.ఒక దశలో ఇంగ్లండ్ 86 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ మొయిన్ అలీ, సామ్ క్యూరన్ ఏడో వికెటుకు 81 పరుగులు జోడించారు. ఆ తర్వాత అశ్విన్ బౌలింగ్‌లో మొయిన్ అలీ వెనుదిరగడంతో ఇంగ్లండ్ త్వరత్వరగా వికెట్లను కోల్పోయింది.భారత బౌలర్లలో బుమ్రా మూడు వికెట్లు తీయగా, అశ్విన్, ఇషాంత్ శర్మ, షమీలు తలో రెండు వికెట్లు తీశారు. హార్ధిక్ పాండ్యాకు ఒక వికెట్ దక్కింది.ఇక బౌలర్స్ పని ముగించారు,మన బ్యాట్స్‌మెన్ ఏవిధంగా ఆడుతారు అనేది వేచి చూడాలి.