కొందరి సెల్ఫీల పిచ్చి పరాకాష్టకు చేరుతోంది. ఎప్పుడు, ఎక్కడ ఎలా సెల్ఫీ దిగాలో కూడా తెలియకుండా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ప్రముఖనటుడు, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో నార్కట్‌పల్లి కామెనేని ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతిచెందారు. అయితే అక్కడపనిచేసి సిబ్బంది హరికృష్ణ పార్దీవదేహంతో సెల్ఫీలు దిగారు. అంతటితో ఆగకుండా ఆఫొటోలను సోషల్‌మీడియాలో షేర్ చేసారు. భౌతికకాయంతో, అదీ నవ్వుతూ ఫొటోలు దిగడంతో నెటిజన్లు వారిపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఎలాంటి సందర్భాల్లో సెల్ఫీలు దిగాలో కూడా తెలియదా అని చివాట్లు పెడుతున్నారు. మానవత్వం చనిపోయిందంటూ కొందరు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు సెలబ్రిటీ అయితే చాలు శవమనే కనీస మానవత్వం లేకుండా సెల్ఫీలు దిగుతున్నారంటూ తిట్టిపోస్తున్నారు. ఈ ఫొటోలు ప్రస్తుతం వైరల్ అయ్యాయి.
