వైఎస్సార్ కాంగ్రెసక పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్‌కే రోజా తన నియోజకవర్గం నగరిలో కొత్త ఇల్లు నిర్మించుకున్నారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఇల్లు కట్టుకున్నారు. గెలిచిననాటినుంచి క్రమం తప్పకుండా నియోజకవర్గంలో తిరుగుతున్నారు రోజా ఈక్రమంలో రోజా నగరిలో సొంతంగా ఇల్లు నిర్మించుకున్నారు. గృహప్రవేశం సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు రోజా.. మీఇంటి బిడ్డగా, ఆడపడుచుగా, సోదరిగా ఆదరించి గెలిపించారు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోను.? ఎప్పటికీ మీ వెంటే ఉంటా. మీ కష్టాలను తీర్చే ప్రతినిధినవుతానని నియోజకవర్గ ప్రజలనుద్దేశించి అన్నారు. నిత్యం అందుబాటులో ఉండాలనే నగరిలో ఇల్లు కట్టుకున్నాన్నారు. ఈ కార్యక్రమానికి పార్టీలకతీతంగా నాయకులు, అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. రోజా దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
