మీకు ఏవైనా బ్యాంకుపనులు అర్జంటుగా ఉన్నాయా..అయితే ఈ రోజే పూర్తి చేసుకోండి ఎందుకంటే రేపటి నుంచి వరుసగా ఐదు రోజులపాటు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. సెప్టెంబర్ 1 నుంచి 5వ తేదీ వరకు బ్యాంకులు మూత పడే అవకాశాలు ఉన్నాయి. శనివారం పనిదినాలైనా..అది కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే వర్తిస్తాయి. 2వ తేదీ ఆదివారం. 3వ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి. 4, 5 తేదీల్లో యునైటెడ్ ఫోరం ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫోరం (యూఎఫ్ఆర్బీవోఈ) సమ్మెకు పిలుపునిచ్చింది. ఆ రెండు రోజులు భారతీయ రిజర్వు బ్యాంకు సిబ్బంది మూకుమ్మడి సెలవులు పెట్టే అవకాశం ఉంది. దాంతో బ్యాంకు పనులకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ రెండు రోజులు బ్యాంకులు తెరుకున్నా లావాదేవీలు జరగకపోవచ్చు. అంటే, మొత్తంగా ఐదు రోజులు బ్యాంకులు మూతపడే అవకాశం ఉంది.
Tags 5 days bank holidays September srikrishnastami
Related Articles
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు
November 19, 2023