హైదరాబాద్‌లోని మెహదీపట్నంలో ఉన్న నందమూరి హరికృష్ణ ఇంటికి వెళ్లే దారులన్నీ బుధవారం జనదిగ్బంధంతో కిక్కిరిసిపోయాయి. ఇప్పటికే తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, గవర్నర్ నరసింహన్ పలువురు సినీ రాజకీయ పెద్దలు నివాళులర్పించారు. అభిమానులు కడసారి చూసేందుకు తరలివస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వంగవీటి రాధాకృష్ణ హరికృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్త పరిచారు.
