కేరళ వరద బాధితులను ఆదుకోవడానికి పలువురు ప్రముఖులు, టెక్ దిగ్గజాలు మొదలుకొని సామాన్యుల వరకు తమకు తోచిన సహాయాన్ని అందించిన విషయం అందరికి తెలిసిందే.అయితే కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు నిన్నటి వరకు 730 కోట్ల రూపాయలు సహాయం అందాయని ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. వరదల అనంతర పరిస్థితులపై, పునరావాస చర్యలపై చర్చించడానికి కేరళ అసెంబ్లీ గురువారం ప్రత్యేకంగా సమావేశం అయింది.
కేంద్ర ప్రభుత్వ తక్షణ సాయం(600 కోట్ల రూపాయలు) కన్నా ఇది 21.7 శాతం ఎక్కువని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తమ అంచనాల కన్నా మూడు రెట్లు ఎక్కువ వర్షపాతం నమోదైందని తెలిపారు. కేరళను పునర్మించడానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని అయన చెప్పారు. ప్రపంచ నలుమూలల నుంచి కేరళను ఆదుకోవడానికి అనేక మంది ముందుకొస్తున్నారని దీనికి మాకు చాల సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి పినరయి విజయన్ చెప్పారు. ప్రకృతి విలయం కారణంగా కేరళలో సుమారు 20వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్టు ప్రభుత్వం అంచనా వేసింది.వరదలు కారణంగా 483మంది మరణించారని ఇంకా 15మంది ఆచూకీ తెలియలేదని ఆయన వెల్లడించారు.