అమరావతిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసముంటున్న ఉండవల్లి గ్రామంలో తమ అనుమతి లేకుండానే పంటపొలాల్లో కరెంట్ హైటెన్షన్ లైన్లు ఏర్పాటు చేస్తున్నారంటూ గ్రామ రైతులు ఆందోళనకు దిగారు. హైటెన్షన్ లైన్లను ఏర్పాటు చేస్తున్న అధికారులను అడ్డుకున్నారు. దీంతో భారీగా పోలీసు బలగాలను రంగంలోకి దించి హైటెన్షన్ లైన్ను ఏర్పాటుచేసే ప్రయత్నం చేశారు. రైతులు పెద్దఎత్తున గుమిగూడి హైటెన్షన్ లైన్ ఏర్పాటుచేయ్యొదంటూ ఆందోళనకు దిగారు. దీంతో రైతులకు, పోలీసులకు మధ్య వాగ్వివాదం జరిగింది. హైటెన్షన్ లైన్ ఏర్పాటు వ్యతిరేకంగా రైతులు పురుగుల మందు తాగేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకొని అరెస్ట్ చేశారు. అధికారుల తీరుపై పోలీసులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతోనే ఇలా చేస్తున్నారంటూ బాబు తీరుపై మండిపడుతున్నారు.