నందమూరి హరికృష్ణ మృత దేహానికి జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ తన సంతాపాన్ని తెలియజేశారు. నల్గొండ జిల్లాలో హరికృష్ణ గారు రోడ్డు ప్రమాదానికి గురయ్యారని తెలియగానే గాయాలతో బయటపడతారని అనుకొనేలోపే విషాదవార్త వినాల్సివచ్చిందన్నారు. సినీ, రాజకీయ రంగాల్లో ఆయన చేసిన సేవలు మరచిపోలేనివని.. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ముందుకెళ్లేందుకు భగవంతుడు శక్తి ఇవ్వాలని ప్రార్థిస్తున్నట్లు పవన్ తెలిపారు. ఆయన మరణంతో నన్ను ఎంతగానో కలిచి వేసింది అని పవన్ కళ్యాణ్ తెలిపారు. హరికృష్ణ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టు ఆయన తెలిపారు. తన తరఫున, జనసేన శ్రేణుల తరఫున ఆయనకు నివాళులు అర్పిస్తున్నానని అన్నారు. ఏపీకి అన్యాయం జరగడంపై విభజన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారని పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు. ఇది అందరికీ గుర్తుకు ఉండిపోయే సంఘటన అన్నారు. ఇది బాధ కలిగించే విషయం అన్నారు.