Home / 18+ / చిన్నతనంలో పశువులతో వ్యాపకం.. ఎంత ఎదిగినా మర్చిపోలేదు.. ఇప్పటికి తప్పకుండా ఆ సంతకు వెళ్తుండేవారట..

చిన్నతనంలో పశువులతో వ్యాపకం.. ఎంత ఎదిగినా మర్చిపోలేదు.. ఇప్పటికి తప్పకుండా ఆ సంతకు వెళ్తుండేవారట..

నందమూరి హరికృష్ణకు సినిమాలు, రాజకీయాలు, కుటుంబం అంటే ఎంత బాధ్యతో పశువులంటే అంతే వ్యాపకం.. చిన్నతనంలో నిమ్మకూరులోనూ కుక్కలు, ఆవులు, గేదలతో ఎక్కువగా ఉండేవారట.. ఎంత ఎదిగినా ఆఅలవాట్లనూ ఇప్పటికీ మర్చిపోలేదాయన.. ఆయనమృతితో ఎల్‌బీనగర్‌ చింతల్‌కుంటలో తీవ్ర విషాదం నెలకొంది. చింతలకుంటలో ఆయనకు చాలామంది స్నేహితులున్నారు. ముప్పైఏళ్లుగా అక్కడి పశువులసంతకు వెళ్తుండేవారు. చిన్ననాటి స్నేహితుడు నాగేశ్వరరావుకు పశువులపాకలో గంటలతరబడి కాలక్షేపం చేసేవారు. వారానికి నాలుగైదు సార్లు ఇక్కడికి వచ్చే వారని స్థానికులు చెప్తున్నారు. గతంలో రాజమండ్రిలో రూ.4లక్షలకు ఓ కపిలిఆవును కొనుగోలుచేసి 4ఏళ్లపాటు పెంచి తర్వాత గన్నవరంలోని తన స్నేహితుడు పూర్ణచందర్రావుకు ఇచ్చారట.. హరికృష్ణ బుధవారం తెల్లవారుజామున నెల్లూరుకు వెళ్లేటప్పుడు కూడా చింతల్‌కుంటలో 5నిమిషాలు ఆగి ప్రశాంత్‌నగర్‌లో ఉంటున్న తన స్నేహితుడు వెంకట్రావును కారులో ఎక్కించుకొని వెళ్లేందుకు అక్కడి దుర్గావిలాస్‌ హోటల్‌ ముందు ఆగారట.. అప్పుడు కూడా పశువులసంత వ్యాపారులు సత్తిబాబు, సాంబశివరావు కారువద్దకు వెళ్లి మాట్లాడగా డ్రైవింగ్‌ సీటులో హరికృష్ణ ఉండగా, పక్క సీటులో శివాజీ ఉన్నాడని వారు పేర్కొన్నారు. వ్యాపారాలు ఎలా సాగుతున్నాయని ప్రశ్నించారని, అంతాబాగానే ఉందని సమాధానమిచ్చామని వారు తెలిపారట.. ఆయన మరణ వార్త విని సదరు వ్యాపారులు దుఖసాగరంలో మునుగుతున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat