తాజాగా ముస్లిం యువకుల అరెస్ట్ తో రాష్ట్రవ్యాప్తంగా ముస్లింలు టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. టీడీపీపాలనలో ఎప్పుడూ మైనార్టీలకు న్యాయం జరగలేదని తూర్పుగోదావరి జిల్లా ముస్లిం మైనార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. గుంటూరులో ముస్లిం యువకులపై ప్రభుత్వ తీరును దుశ్చర్యగా ఖండించారు. గత ఎన్నికల్లో మాటల గారడితో ముస్లింల వంచనకు పాల్పడ్డారని, నాలుగున్నర సంవత్సరాల తర్వాత టీడీపీకి ముస్లింలు గుర్తుకువచ్చారన్నారు. మైనార్టీల పట్ల చంద్రబాబు సవతిప్రేమ నటిస్తున్నారని విమర్శించారు. ముస్లింలపై ప్రభుత్వ దౌర్జన్యానికి నిరసనగా ముస్లిం మైనార్టీలు ఎక్కడికక్కడ పెద్దఎత్తున ఆందోళన నిర్వహించారు. అరెస్టయిన తొమ్మిదిమంది యువకులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నాలుగేళ్ల పాటు బడ్జెట్‌లో చూపడమే తప్ప ఆచరణలో కనీసం 30శాతం నిధులను కూడా మైనార్టీల సంక్షేమానికి ఉపయోగించలేదన్నారు. గుంటూరులో మైనార్టీ కార్యకర్తల అరెస్ట్ ను నిరసిస్తూ కరీంనగర్‌లో వైయస్‌ఆర్‌సీపీ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. ముస్లింలకు అన్యాయం చేస్తున్నారంటూ చంద్రబాబు దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. టీడీపీ ప్రభుత్వం ముస్లింలపై అణచివేత చర్యలకు పాల్పడుతోందని వైయస్‌ఆర్‌సీపీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు మహ్మద్ సలీం అన్నారు
