మాజీ రాజ్యసభ సభ్యులు, ప్రముఖ సినీనటుడు నందమూరి హరికృష్ణ మృతిపట్ల వైఎస్సార్‌సీపీ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. హరికృష్ణ అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదంలో మృతిచెందడం తనను షాక్‌కు గురుచేసిందని ఆపార్టీ అధ్యక్షుడు జగన్ పేర్కొన్నారు. కృష్ణాజిల్లా గుడివాడలో వైఎస్సార్‌సీపీ ఆధ్యర్యంలో హరికృష్ణ చిత్రపటానికి నివాళులర్పించారు. మాజీ ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే అంజద్ బాషా, మేయర్ సురేష్ బాబు విచారం వ్యక్తం చేశారు. హరికృష్ణ కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ.. హరికృష్ణ మరణం నందమూరి అభిమానులకు తీరని లోటన్నారు. అలాగే మృతదేహంవెంటే ఉంటూ కొడాలినాని నిజమైన స్నేహితుడిగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ క్రమంలో విశాఖజిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మళ్లీ తన గొప్ప మనసును చాటుకున్నారు. నందమూరి హరికృష్ణగారికి యాక్సిడెంట్ జరిగిందని తను మనమధ్యనుంచి వెళ్లిపోయారనే వార్త తెలిసి బాధగా ఉందని, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్త పరుస్తున్నానని తెలిపారు. బహిరంగ సభలో ప్రసంగించేముందు నందమూరి హరికృష్ణను తలచుకోవడం పట్ల ఆప్రాంతమంతా ఉద్వేగ భరితంగా మారింది.
