ఈరోజు ఉదయం నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మరణించారు.. నెల్లూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా అన్నేపర్తి దగ్గర డివైడర్ను ఢికొట్టిన కారు పల్టీలు కొడుతూ రోడ్డు పక్కకు పడిపోయింది. దీంతో కారులోంచి బయటకు పడిపోయిన హరికృష్ణకు తలకు, శరీరానికి తీవ్ర గాయాలై చనిపోయారు. హరికృష్ణను స్థానికులు నార్కట్పల్లి కామినేని ఆస్పత్రిగా తీసుకెళ్లగా చనిపోయారని తెలుస్తోంది. దీంతో నందమూరి అభిమానుల్లో తీవ్ర విషాధం నెలకొంది. అయితే నందమూరి కుటుంబంలో అందరూ స్వయంగా కారు నడిపి ప్రమాదానికి గురయినవారే కావడం ఇప్పుడు దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. నందమూరి తారక రామారావు(జూ.ఎన్టీఆర్) అదే జిల్లాలోని మోతే దగ్గర 2009 మార్చి 27న ప్రమాదానికి గురయ్యారు. అలాగే 2014 డిశంబర్ 6న అదే జిల్లా ఆకుపాముల దగ్గర వద్ద నందమూరి జానకీరామ్ ప్రమాదానికి గురై చనిపోయారు. ఇప్పుడు నందమూరి హరికృష్ణ అదే నల్గొండ జిల్లా అన్నేపర్తిలో రోడ్డు ప్రమాదానికి గురై చనిపోయారు. అయితే ప్రమాదానికి గురైన ముగ్గురూ నల్గొండ జిల్లాలోనే జరగడం ఒక ఎత్తైతే ఆ ముగ్గురూ కారు స్వయంగా నడుపుతూ ప్రమాదానికి గురవడం బాధాకరం.
