నందమూరి హరికృష్ణకు ఎన్టీఆర్ చైతన్య రధానికి ఎంతో సంబంధం ఉండేది.. 1983లో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు రామారావు రాష్ట్రమంతటా తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దానికోసం హరికృష్ణ ముందుగా ఓ వాహనాన్ని కొనుగోలు చేసి, దానిని ప్రచారరధంగా తయారు చేయించారు. తండ్రి కూడా రాష్ట్రమంతా తిరిగేవారు.
హరికృష్ణే ఆరధాన్ని నడిపేవారు. ఎన్టీఆర్ సభలు సమావేశాలు నిర్వహిస్తున్నప్పుడు ఖాళీ సమయాల్లో దానికి మరమ్మత్తులు చేయించి సిద్ధం చేసేవారు. ఆప్రచారంతోనే ఎన్టీఆర్ వేగంగా ప్రజలకు దగ్గరయ్యారు. ప్రచారరధం కారణంగానే అప్పట్లో ఎన్టీఆర్ రాష్ట్రమంతా తిరగడం సులభతరం అయ్యిందట. అయితే ఇప్పుడు ఆ రధంపైనే హరికృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి.
హైదరాబాద్ లోని రామకృష్ణ సినీ స్టూడియోలో ఉన్న చైతన్య రథాన్ని అంతిమ యాత్రకు సిద్ధం చేస్తున్నారని సమాచారం. ఎన్టీఆర్ పర్యటన ఆసాంతం చైతన్య రథాన్ని నడిపిన ఆచన అప్పటినుంచి థసారధిగానే గుర్తుండిపోయారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి. తెలుగుదేశం పార్టీని నిలబెట్టిన నాయకుల్లో ఒకరిగా హరికృష్ణకి గుర్తింపు ఉంది.