నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. నల్గొండ జిల్లా అన్నేపర్తి వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో నటుడు హరికృష్ణ తుది శ్వాస విడిచారు. హరికృష్ణ భౌతికకాయాన్ని చూసేందుకు కామినేని ఆస్పత్రికి చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ తండ్రి హరికృష్ణ భౌతికకాయాన్ని చూడగానే బోరున విలపించారు. తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక తీవ్రంగా కన్నీరుమున్నీరయ్యారు. ఆస్పత్రిలోనే సోదరులిద్దరూ విలపించారు. జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌తోపాటు బాలకృష్ణ, పురందేశ్వరి, చంద్రబాబు, లోకేశ్ ఇతర కుటుంబసభ్యులు. హరికృష్ణ పార్థీవదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహిస్తున్నారు. పోస్టుమార్టం తర్వాత హైదరాబాద్‌లోని నివాసానికి తరలిస్తారు. ఇతర కుటుంబ సభ్యులు, అభిమానులు హైదరాబాద్‌లోని హరికృష్ణ నివాసానికి చేరుకుంటున్నారు. హనాబాద్‌లోని ఫాంహౌస్‌లో సాయత్రం అంత్యక్రియలు జరగనున్నాయని తెలుస్తోంది.
