వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత అధినేత జగన్మోహన్ రెడ్డి పెళ్లిరోజు సందర్భంగా ఆపార్టీ ఎమ్మెల్యే ట్వీట్ చేశారు. జగనన్న దంపతులకు మనసారా హృదయపూర్వక పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. జగన్ భారతి జంట శివపార్వతుల్లాగా కలిసి ఉండాలని ఆకాంక్షించారు. జగన్, భారతిల పెళ్లి ఫొటోను తన ఫేస్‌బుక్ లో పోస్టు చేసిన రోజా, సీతమ్మ వంటి భారతమ్మ జగన్‌కు దొరికిందని అభిప్రాయపడ్డారు. ‘సీతమ్మలాంటి భారతమ్మ దొరికినందుకు జగనన్నకి, రాముడులాంటి జగనన్న భర్తగా దొరికినందుకు భారతమ్మకి… ఇద్దరికీ హృదయపూర్వక పెళ్ళిరోజు శుభాకాంక్షలు. మీరు నిండు నూరేళ్ళు సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో శివపార్వతుల్లాగా కలిసి ఉండాలని మనసారా కోరుకుంటన్నాము అని జగన్ పై తన అభిమానాన్నిచాటుకుంటూ దేవుళ్లతో జగన్, భారతిలను పోల్చుతు పెళ్లిరోజు ఫొటోలను పెట్టి విషెస్ చెప్తూ ప్రస్తుతం రోజా పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. రాఖీ సందర్భంగా కూడా రోజా మహిళందరికీ జగన్ బంగారు భవిష్యత్తునివ్వాలని కోరుకుంటూ బంగారు రాఖీని కట్టి తన ప్రేమాభిమానాలను చాటుకున్నారు.
