తమిళ రాజకీయాలతో పెనవేసుకున్న డీఎంకే పార్టీకి అధ్యక్షుడుగా ఎంకే స్టాలిన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే పార్టీ కోశాధికారిగా దురైమురుగన్ను ఎన్నుకున్నారు. డీఎంకే అధ్యక్షుడిగా స్టాలిన్ ఎన్నికను పార్టీ ప్రధాన కార్యదర్శి అధికారికంగా ప్రకటించారు. 50 ఏళ్ల తర్వాత డీఎంకేలో అధ్యక్షుడి ఎన్నిక జరిగింది. 70 ఏళ్ల డీఎంకే పార్టీ చరిత్రలో స్టాలిన్ మూడో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అధ్యక్షుడుగా స్టాలిన్ ఎన్నిక కావడంతో డీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయంలో కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఇటీవలే కరుణానిధి మరణంతో కాళీ అయిన అధ్యక్ష పదవికి ఎన్నిక జరిగగా కొత్త అధ్యక్షుడిగా స్టాలిన్ భాద్యతలు అందుకున్నారు.
