భారత దేశపు మాజీ ప్రధానమంత్రి ,భారత రత్న ,బీజేపీ పార్టీ సీనియర్ నేత అయిన అటల్ బీహారి వాజ్ పేయి ఇటీవల మరణించిన సంగతి తెల్సిందే . అయితే వాజ్ పేయి మరణం గురించి బీజేపీపార్టీకి మిత్రపక్ష పార్టీ అయిన శివసేన పలు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ పార్టీ అధికారక పత్రిక అయిన సామ్నా లో ఒక సంపాదకీయంలో పలు అనుమానాలను లేవనెత్తింది..
స్వరాజ్యం అంటే ఏమిటీ అనే శీర్షికతో ప్రచురించిన ఆ సంపాదకీయంలో శివసేన ఎంపీ,సామ్నా ఎడిటర్ సంజయ్ రౌత్ వాజ్ పేయి ఆగస్టు పదహారు తారీఖునే చనిపోయరా లేదా.. లేదంటే ఆగస్టు పదిహేను నాడు మరణించారా అని ఆయన ప్రశ్నించారు.
అక్కడితో ఆగకుండా ప్రజలకంటే ముందుగా మన నేతలు స్వరాజ్యం గురించి సరిగా ఆర్థం చేస్కొవాలి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తూ ఆగస్టు పదిహేనో తారిఖున దేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఉన్నందుకు దేశవ్యాప్తంగా సంతాపదినాలు ,జెండాల అవతనం లేకుండా ఉండేందుకే కేంద్రసర్కారు ఈ నిర్ణయం తీసుకుందా అని ఎర్రకోట మీదుగా సుదీర్ఘమైన మోదీ ప్రసంగానికి అడ్డంకులు లేకుండా వాజ్ పేయి మృతిని పదహారున
ప్రకటించారా అని ప్రశ్నించింది..