తాను సెప్టెంబర్ 4న హైదరాబాద్ వెళ్తున్నట్లు పరిపూర్ణానంద స్వామి సంచలన ప్రకటన చేసారు. గతంతో పరిపూర్ణానంద స్వామిని హైదరాబాద్ నగర బహిష్కరణ చేస్తూ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. అనంతరం ఆయనను ఆంధ్రాలో విడిచిపెట్టారు. అయితే పరిపూర్ణానందను హైదరాబాద్‌కు రావాలంటూ బీజేపీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్, ఆర్‌ఎస్‌ఎస్ నేతలు ఆహ్వానించారు. ఈనేపథ్యంలో ఆయన సెప్టెంబర్ 4న హైదరాబాద్ వెళ్తున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ నగర బహిష్కరణ సరైనదా? కాదా? అనేది ప్రజలే నిర్ణయిస్తారని ఆయన వ్యాఖ్యానించారు. 250మందిని చంపిన ఉగ్రవాది కసబ్‌ను దేశంలో ఉంచారన్నారు. కానీ తనను మాత్రం తెలంగాణ నుంచి ఎలా బహిష్కరిస్తారని ప్రశ్నించారు. దీంతో మరోసారి పరిపూర్ణానంద వార్తల్లో నిలిచారు.
