అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎవ్వరూ జనసేనలోకి వెళ్లే అవకాశమేలేదని న్యాయశాఖామంత్రి కొల్లురవీంద్ర తెలిపారు. ప్రభుత్వంపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేస్తున్నవన్నీ నిరాధార ఆరోపణలేనని ఆయన అన్నారు. అమరావతి బాండ్లను కొనడానికి ప్రజలు పోటీపడ్డారని ఆయన రవీంద్ర అన్నారు. పవన్ కళ్యాణ్ అవగాహనా రాహిత్యంతో ఉన్నారని ఆయన మాటలు ఎవరూ పట్టించుకోరన్నారు. తాజాగా పవన్ పార్టీలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు చేరడానికి సిద్ధంగా ఉన్నారని జనసేన నాయకులు చేసిన వ్యాఖ్యల్లో ఎటువంటి నిజం లేదన్నారు మంత్రి రవీంద్ర.
