టీడీపీ ప్రభుత్వం చేసే ప్రతి పని పైనా జాతీయ స్థాయిలో నిఘా ఉంటుందని
బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సంచలన వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రాభివృద్ధిలో ఏపీ వెనుకబడిందని, అవినీతిలో మాత్రం నెంబర్ వన్లో ఉందని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వానికి విలాసాల మీద ఉన్న ధ్యాస వికాసంపై లేద, ధర్మపోరాటం పేరుతో దొంగ పోరాటం చేస్తున్నారని మండిపడ్డారు. కార్పొరేట్ సంస్థల అధిపతి మంత్రిగా ఉన్నారని, ఆయన ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలు ఎలా ఉంటాయో అందరికీ తెలుసన్నారు. అభివృద్ధి కోసం రుణాలు తేవడం తప్పుకాదు కానీ ఏపీలో నిధులను దుర్వినియోగం చేస్తూ తాత్కాలిక నిర్మాణాలకే పరిమితం అవుతున్నారన్నారు. ప్రభుత్వం రుణాలు తీసుకోవడమే పెద్ద కుంభకోణం అని అందుకే లెక్కలు చెప్పేందుకు భయపడుతున్నారని విమర్శించారు. అమరావతిలో వెయ్యి ఖర్చయ్యే చోట పదివేలు చేస్తున్నారన్నారన్నారు.