తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు తాను ప్రాతినిథ్యం వహిస్తున్న సిద్ధిపేట నియోజకవర్గానికి చెందిన ప్రజలకు రాష్ట్ర సర్కారు అమలుచేస్తున్న హరితహారం కార్యక్రమం గురించి ఇచ్చిన వాయిస్ సందేశం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. మీరు ఒక లుక్ వేయండి.. “మన సిద్ధిపేట పట్టణాన్ని మీ అందరి సహకారం తో అన్నింటా అభివృద్ధి చేసుకొని రాష్ట్ర స్థాయి లో దేశ స్థాయి లో ఆదర్శం గా నిలిచింది మన సిద్ధిపేట ..
హరిత చైతన్యం చాటుతూ రాష్ట్ర స్థాయి లో మన సిద్ధిపేట పట్టణం హరిత మిత్ర అవార్డును కూడా పొందింది మరొకసారి ఈ నెల 28 వ తేదీన 50 వేల మొక్కలు ఒకేరోజు సిద్ధిపేట మున్సిపాల్టీ లో పెట్టాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నాం మరి ఈ నెల 28 వ తేదీన ఈ హరిత ఉద్యమంలో మీరు అందరు తప్పకుండ పాల్గొని మొక్కలని నాటండి నాటినా మొక్కలను పరిరక్షించండి ఈ సిద్ధిపేట ను ఒక గ్రీన్ సిద్దిపేట గా ఒక క్లిన్ సిద్ధిపేట గా మనము మార్చుకుందాం..
ఇది ఏ ఒక్క వక్తి తోనో సాధ్యం కాదు పట్టాన ప్రజలందరి సాకారం తోనే ఇది సాధ్యం అవుతుంది మీ అందరి ఆరోగ్యం కోసం మీ పిల్లల భవిషత్తు కోసమే ఈ హరిత ఉద్యమాన్ని చేపట్టాం అందువల్ల మన పిల్లలకు ఎంత మంచి ఆస్థి పస్తులు యిచ్చాము అనేదానికంటే కూడా ఎంత మంచి ఆరోగ్యాన్ని పంచం ఎంత మంచి ఆరోగ్యాన్ని మన పిల్లలకు భవిషత్తు తరాలకు అందించాము అన్నది చాల ముఖ్యమైనటువంటిది అందువల్ల మీరు అందరుకూడా ఈ హరిత ఉద్యమం లో పాలుగొనండి 28 వ తేదీ నాడు మొక్కలునాటి మీ యొక్క భాగస్వామ్యాన్ని కల్పించండి “అని ఇచ్చిన వాయిస్ ప్రస్తుతం ట్రెండ్ సృష్టిస్తుంది..