ఏపీ అధికార టీడీపీ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతుంది.ఈ క్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి కొండ్రు మురళి టీడీపీ తీర్ద్ఘం పుచ్చుకొవడానికి రెడీ అయ్యారు. ఈ క్రమంలో ఈ నెల
ముప్పై ఒకటో తారిఖున టీడీపీ కండువా కప్పుకోవడానికి రెడీ అయ్యారు. శ్రీకాకుళం జిల్లాలోని రాజాం నియోజకవర్గానికి చెందిన స్థానిక టీడీపీ నేతలతో ,కార్యకర్తలతో వరస సమావేశాలను ఏర్పాటు
చేసుకున్నారు కొండ్రు మురళి. అందులో భాగంగా కొండ్రు మురళి టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో భారీగా అనుచరులతో ఆయన పసుపు కండువా కప్పుకొనున్నట్లు
మీడియా సమక్షంలో ప్రకటించారు..
