Home / 18+ / లైంగిక వేధింపులకు గురవుతున్న విద్యార్ధినులకు తండ్రిలా అండ.. నిందితుడిని ఏం చేసారో తెలుసా.?

లైంగిక వేధింపులకు గురవుతున్న విద్యార్ధినులకు తండ్రిలా అండ.. నిందితుడిని ఏం చేసారో తెలుసా.?

నాయకుడంటే వేగంగా స్పందించాలి. నాయకుడంటే ప్రజల సమస్య విని చలించాలి.. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అదే చేసారు. విశాఖ ఒకేషనల్ కాలేజ్ డైరెక్టరు కుమార్ విద్యార్ధినులపై సెక్సువల్ హెరస్మెంట్ కు పాల్పడుతున్నారని, ఓ విద్యార్ధినిపై అత్యాచార యత్నం చేయబోయాడని విజయసాయిరెడ్డికి కళాశాల విద్యార్థినులు తెలిపారు. ఆయన వెంటనే ఈ విషయంపై స్పందించారు. పోలీసులకు చెప్పే ధైర్యం చేయలేని ఆ అమ్మాయిలకు ఓ తండ్రిలా అండగా నిలిచారు. పార్టీ నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్ వద్దకు తీసుకెళ్లి ఫిర్యాదు చేసారు.

 

ఆ కళాశాల డైరెక్టర్ కుమార్ అతనికి సహకరిస్తున్న ప్రిన్సిపల్ గ్లోరిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసారు. అంతేకాదు.. ఈ గొడవలతో విద్యార్ధుల ఎడ్యుకేషన్ ఇయర్ పాడవుకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తూ కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. మీకు ఏ కష్టం వచ్చినా తనతో చెప్పుకోవాలని తాను అండగా ఉంటానని ధైర్యాన్నిచ్చారు. డైరక్టర్ కుమార్ చట్టపరంగా శిక్షించేంతవరకూ వదిలిపెట్టనన్నారు విజయసాయి. ఇంతకాలం డైరక్టర్ కుమార్ వేధింపులకు గురైన విద్యార్ధులు విజయసాయి అండతో ఆనందం వ్యక్తం చేసారు. తమకు అన్యాయం జరిగితే వచ్చి చర్యలు తీసుకునే నాయకుడు దొరికినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat