విడుదల రాజకుమారి ఒక ఎన్నారై.. వీఆర్ ఫౌండేషన్ అనే ట్రస్ట్ ద్వారా ఈమె చేస్తున్న సామాజికసేవ ద్వారా చిలకలూరిపేట ప్రజలకు పరిచయమయ్యారు.. అయితే తాజాగా రాజకుమారి వైఎస్ జగన్ ను కలిసి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును ఓడిస్తానని శపధం కూడా చేసారు.. ఎందుకో చూద్దాం.. గతంలో రాజకుమారి ప్రజాసేవ చేయడం, తద్వారా మంచి పేరు తెచ్చుకోవడం చూసిన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఈమెను చంద్రబాబు వద్దకు తీసుకెళ్లారు. అప్పుడే చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో చిలకలూరి పేట టికెట్ ఇస్తామని రాజకీయాలద్వారా ప్రజలకు మరింత సేవ చేయొచ్చనీ చెప్పారు.
ఇలా ఈమె ప్రత్తిపాటి పుల్లారావు ద్వారా తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే ప్రస్తుతం మంత్రిగా ఉన్న పుల్లారావు వచ్చే ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి తానే పోటీ చేస్తానని చెప్పారు. అలాగే ప్రత్తిపాటిని కాదని రాజకుమారికి టికెట్ ఇచ్చే పరిస్థితి లేదని టీడీపి అధిష్టానం కూడా ఆమెకు తేల్చి చెప్పేసింది.. దాంతో కచ్చితంగా ప్రత్తిపాటిని ఓడిస్తానని ఆమె శపథం చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ప్రయత్నించారు. అయితే అక్కడ ఇప్పటికే మర్రి రాజశేఖర్ ఉన్నారు. ప్రస్తుతం ఆయన అనారోగ్యంతో బాధపడుతుండడంతో ఆయన పోటీ చేసే స్థితిలో లేనట్లు చెబుతున్నారు. రాజశేఖర్ భార్యకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. ఆయన భార్యకు టికెట్ ఇస్తే పుల్లారవుపై ఓడిపోయే అవకాశం ఉంది కాబట్టి కచ్చితంగా రాజకుమారి బరిలోకి దింపాలని, మర్రికి మరోరకంగా పార్టీ న్యాయం చేయబోతోందని తెలుస్తోంది.
ఈనేపధ్యంలో విశాఖ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్ సమక్షంలో ఈనెల 24న తేదీన వైసిపిలో చేరారు. ఆమెకు టికెట్ ఇవ్వడానికి జగన్ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.. మొత్తమ్మీద పుల్లారావు అంతం తన పంతం అంటూ రాజకుమారి దూసుకెళ్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రాజధాని భూ కుంభకోణం, పత్తి కుంభకోణంలో మంత్రి సాక్ష్యాధారాలతో సహా దొరికిపోవడం, తెలుగుదేశంనుంచే ఓ మహిళ పంతంతో వైసీపీలో చేరడంతో టీడీపీ ఓట్లు కూడా చీలతాయని తెలుస్తోంది. ప్రస్తుత పరిణామాలతో ప్రత్తిపాటికి ఓటమి తప్పేలా లేదు.