‘ఒరు అదార్ లవ్’ సినిమాలోని ఓ పాటలో కన్నుగీటుతూ విపరీత పాప్యులారిటీ తెచ్చుకున్న ప్రియా ప్రకాశ్ వారియర్..ఆపదలో ఉన్న తన సొంత రాష్ట్రానికి అండగా నిలిచింది.. కేరళ రాష్ట్ర వరద బాధితులకు అండగా కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.లక్ష విరాళంగా ఇస్తునట్లు ప్రకటించింది. ఈ క్రమంలోనే ఆమె ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలిపింది. ఈ మేరకు ఆమె తన ఇన్స్టాగ్రామ్లో ఒక లేఖను పోస్ట్ చేస్తూ.. “ ఓనం సందర్భంగా నా రాష్ట్రం కోసం చేయగలిగినది చేశాను. మాటలు చెప్పడం కన్నా చేతల్లో చేస్తేనే ప్రయోజనం ఉంటుంది. మీరు కూడా సహాయం చేయండి. విరాళం విషయాన్ని పబ్లిసిటీ కోసం నేను బయటపెట్టలేదు.. ఎంత విరాళం ఇచ్చామో తెలిస్తే ప్రజలు దాన్ని సక్రమంగా ఉపయోగించుకుంటారు. అందుకే చెప్పా. మీరు ప్రశంసించకపోయినా ఫర్వాలేదు. కానీ తక్కువ చేసి మాట్లాడకండి’ అంటూ పోస్ట్ చేసింది.
