కేరళ రాష్ట్ర వరద బాధితులను ఆదుకొనేందుకు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ వ్యాపార వేత్తలు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, క్రీడాకారులు మేమున్నాం అంటూ నగదు, ఆహారం, మందులు, దుస్తులు, తదితర సామాగ్రిని అందజేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఇటీవల కేరళ వరద బాధితులకు అండగా వైసీపీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ తరఫున కోటి రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇస్తునట్లు ప్రకటించారు.అయితే జగన్ బాటలోనే కేఎంసీ కన్‌స్ట్రక్షన్ కంపెనీ అధినేత, నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్ రెడ్డి ముందడుగు వేశారు. కేరళ వరద బాధితులకు రూ.కోటి విరాళంగా అందజేస్తునట్లు ప్రకటించారు.అయితే ఈ మొత్తాన్ని కేరళ సీఎం పినరాయి విజయన్‌ను కలిసి అందజేస్తానని చెప్పారు. ఈ నెల చివరి వారంలో కేరళ వెళ్తానని తెలిపారు.
