Home / 18+ / ఏపీ మంత్రి, ఎంపీల ప్రధాన అనుచరులే చేరారు. సీనియర్లు, వారసులు, అధికారులు వైసీపీ వైపే చూస్తున్నారు. కారణం ఒక్కటే

ఏపీ మంత్రి, ఎంపీల ప్రధాన అనుచరులే చేరారు. సీనియర్లు, వారసులు, అధికారులు వైసీపీ వైపే చూస్తున్నారు. కారణం ఒక్కటే

2019ఎన్నికలు సమీపుస్తున్నకొద్దీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఊపందుకున్నాయి. కాంగ్రెస్, బీజేపీలతోపాటు అధికార తెలుగుదేశం పార్టీనుంచి  వైసీపీలోకి అనేకమంది నేతలు చేరుతున్నారు. గత రోజుల్లోనే అనేక మంది ప్రముఖ నేతలు వైసీపీలోకి చేరిన దాఖలాలున్నాయి. ముఖ్యంగా ప్రత్యేకహోదా పోరాటం విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీడ్ లో ఉండటం వల్ల అనేకమంది నేతలు ఇప్పుడు వైసీపీ వైపు చూస్తున్నారు. హోదా పోరాటం విషయంలో జగన్ విజయవంతం అయ్యారు. చంద్రబాబు హోదాపై ఎన్ని మాటలు మార్చాడో అందరికీ తెలసిందే 2014కు ముందు అధికారం ఇస్తే హోదా తెస్తామన్న చంద్రబాబు తర్వాత మాట మార్చాడు. హోదా అవసరం లేదని, హోదా అంటే జైలుకే అన్నాడు. ఇప్పుడు మళ్లీ జగన్ ను చూసి హోదా కావాలన్నాడు.

 

ఈ మాటలు మార్చడం అందరికీ స్ఫష్టంగా అర్థమయ్యింది. దీంతో చంద్రబాబు గ్రాఫ్ చాలావరకు పడిపోయింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం హోదా విషయంలో మొదటి నుంచి ఒకే అభిప్రాయంతో ఉంది. కేంద్రం ప్యాకేజీ అన్నా, ప్యాకేజీ బావుందని చంద్రబాబు అన్నా పవన్ వంత పాడినా వైసీపీ అన్నింటినీ వ్యతిరేకించింది. రాష్ట్ర డెవలప్ మెంట్ కు హోదా నే పరిష్కారమని వైసీపీ స్పష్టంగా చెబుతూ వచ్చింది. బీజేపీ హోదా ఇవ్వను అన్నా ఎలా ఇవ్వరో చూద్దాం అని జగన్ అన్నారు. ఈవరుస పరిణామాలు జనాల్లోకి బాగా వెళ్లాయి. దీంతో వైసీపీపై జగన్ మీద, వైసీపీ మీద నమ్మకం పెరుగుతోంది. దీంతో వైసీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. కొంతకాలం తెలుగుదేశంపార్టీలోకి వైసీపీ నుంచి వలసలు కొనసాగగా, ఇప్పుడు తెలుగుదేశం నుంచి వైఎస్సార్సీపీలోకి వలసలు జోరందుకుంటున్నాయి.

 

గతంలో ఇటీవలే గుంటూరు, విజయవాడల్లో జగన్ పాదయాత్ర సందర్భంగా టీడీపీ నుంచి నేతలు వైసీపీలోకి చేరారు. జగన్ తో పార్టీ కండువాలు వేయించుకుని వీళ్లు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ సీనియర్ నేత యలమంచిలి రవి వైసీపీలో చేరారు. మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీలో చేరికకు రంగం సిద్ధమయ్యింది. వెంకటగిరి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి రామనారాయణ రెడ్డిని పోటీ చేయించాలని వైఎస్సార్సీపీ భావిస్తోంది. అలాగే చిలకలూరిపేటనుంచి టీడీపీ నాయకురాలు విడుదల రజినీ వైసీపీలో చేరారు. అలాగే పాణ్యం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత కాటసాని రాంభూపాల్ రెడ్డి అనుచరులు బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఎస్‌ఏ సలాం వైసీపీలో చేరారు. అలాగే డెల్టా ప్రాంతానికి చెందిన మాజీ ఎంపీ చేగొండి వెంకట హరిరామజోగయ్య సూర్య‌ప్ర‌కాశ్ కూడా వైసీపీ వైపు చూస్తున్నారు. ఇప్పటికే చెరుకువాడ శ్రీరంగనాధరాజు వైసీపీ తీర్ధం పుచ్చకున్నారు. వరుస పరిణామాలతో ప‌లువురు టీడీపీ నాయ‌కులు వైసీపీ తీర్థం తీసుకునేందుకు సిద్ద‌మవుతున్నారు.

 

అలాగే ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి ప్ర‌ధాన అనుచ‌రుడు కోగ‌టం విజ‌య భాస్క‌ర్ రెడ్డి కొద్దిరోజుల క్రితం ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో పాద‌యాత్ర చేస్తున్న వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో వైసీపీ తీర్ధం తీసుకున్నారు. ఇక మంత్రి కాల్వ శ్రీనివాసులు ప్రధాన అనుచరుడు నారాయణస్వామి చౌదరి వైసీపీ తీర్థం తీసుకున్నారు. ఎన్నో సంవ‌త్స‌రాలుగా ప్ర‌ధాన అనుచ‌రుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్న నారాయణస్వామి చౌదరి వైసీపీలో చేర‌డంతో కాల్వ షాకయ్యడు. అలాగేమాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి వారసుడు రాంకుమార్‌రెడ్డి 2019 ఎన్నికల్లో వెంకటగిరి వైసీపీ నుంచి పోటీ చేస్తానని వెల్లడించారు. కాంగ్రెస్ నుంచి స్తబ్ధుగా ఉన్న సీనియర్లు, వారి వారసులు, కీలక శాఖల్లో పనిచేసిన ఉన్నతాధారులు రాష్ట్రవ్యాప్తంగా 40నుంచి 60మంది లీడర్లు, అధికారులు, వ్యాపారవేత్తలు వైసీపీ తీర్ధం పుచ్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇటీవల ఇంటెలిజెన్స్ నివేదికలోనూ వైసీపీ అధికారంలోకి వస్తుందనే సమాచారం రావడమే ఇందుకు ఉదాహరణ.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat