వైసీపీ అధినేత,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ను ఏపీ మాజీ డీజీపీ నండూరి సాంబశివరావు శనివారం సాయత్రం కలిశారు. విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురంలో ప్రజా సంకల్ప యాత్ర నిర్వహిస్తున్న జగన్తో నండూరి భేటీ అయ్యారు. అయితే త్వరలోనే సాంబశివరావు వైసీపీ పార్టీలో చేరుతునట్లు వార్తలు వస్తున్నాయి.ఈ నెల చివరివారంలో లేదా వచ్చే నెల మొదటి వారంలో అయన జగన్ పార్టీ లో చేరబోతునట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కరు కొడుతున్నాయి.కాగా సాంబశివరావు త్వరలోనే వైసీపీలో చేరుతారని ఆ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.