ఏపీ ప్రతి పక్షనేత , వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు పుట్టిస్తోంది.ఎందరో రాజకీయ ఉద్ధండులున్న గుంటూరు జిల్లా రాజకీయాల్లోకి ఓ ఎన్నారై మహిళ సడన్ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు జిల్లాలో ఆమె పొలిటికల్ ఎంట్రీనే హాట్ టాపిక్‌గా మారింది. ఆమె పేరు విడదల రజనీకుమారి. వీఆర్ ఫౌండేషన్ అనే ట్రస్ట్ ద్వారా పలు రకాల సేవలందిస్తూ చిలకలూరిపేట ప్రజలకు ఇటీవల సుపరిచితురాలయ్యారు. చంద్రబాబు అంటే అభిమానమంటూ ప్రత్తిపాటి పుల్లారావును కలిసి టీడీపీలో చేరారు. టీడీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఆ సమయంలోనే మంత్రి ప్రత్తిపాటి ఆమెను సీఎంకు పరిచయం చేశారు. ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని, అయ్యే ఖర్చంతా భరిస్తానని చెప్పినా పార్టీ అధిష్ఠానం విముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ విషయంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రత్తిపాటిని కాదని టికెట్ ఇచ్చే పరిస్థితి లేదని పార్టీ అధిష్ఠానం తేల్చి చెప్పినట్లు సమాచారం. దీంతో వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలచే పార్టీ వైసీపీ అని తెలిసి వైసీపీలోనే చేరారు. విశాఖ జిల్లా పాదయాత్రలో ఉన్న జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇంకో విషయం ఏమీటంటే తనను పార్టీకి పరిచయం చేసిన పుల్లారావుకే రజనీకుమారి రాజకీయ ప్రత్యర్థిగా మారడం.. ఆయన్ను ఓడించి తీరుతానని జగన్ దగ్గర చెప్పడం ఇప్పుడు గుంటూరు జిల్లా రాజకీయాల్లో సంచలనంగా మారింది.
