టీడీపీ అధికారంలోకి రాగానే జరగాల్సిన ప్రాజెక్ట్…విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టు ఇప్పటికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు దక్షిణ కొరియాకు సంబంధించిన కొన్ని సంస్థలు ముందుకువచ్చాయి. అమరావతిలో ముఖ్యమంత్రి సమక్షంలో జరిగిన సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. రూ.8 వేల కోట్లు అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టుకు డీపీఆర్ రూపొందించారు.దీనికి సంభందించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో సగం పెట్టుకోవాలని భావించగా,కేంద్రం నుండి ఎటువంటి సహాయం రాకపోవడంతో,అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్ ద్వారా 50 శాతం నిధులు పెట్టి, మిగిలిన 50 శాతం నిధులను పీపీపీ విధానంలో సేకరించాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రవుత్వం. ఈ మేరకు టెండర్లు పిలవగా ముంబై, ఢిల్లీ ప్రాంతాలకు చెందిన టాటా, అదాని, ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ తదితర ఐదు సంస్థలు అర్హత సాధించాయి. ఈ ప్రాజెక్టు పనులను రెండు ప్యాకేజీలుగా విభజించారు. ప్యాకేజీ-1లో సివిల్ పనులన్నీ వస్తాయి.
దీనికి అనుగుణంగా రైలు మార్గానికి ఎవరికి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా సరిపడే భూమిని సేకరించి అందజేయలి.దీనిని అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్ చూసుకుంటుంది. ప్యాకేజీ-2లో ట్రాక్ నిర్మాణం, సిగ్నలింగ్, జీపీఎస్ ఏర్పాటు, ఇతర మెకానికల్ పనులు ప్రైవేటు సంస్థ చేపడతాయి.వీటికోసం దక్షిణ కొరియా సంస్థలు ఆశక్తిగా ఉన్నాయి. ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధుల కోసం విశాఖపట్నంలో ప్రభుత్వ భూములను బ్యాంకుల వద్ద తనఖా పెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఇది ఇల ఉంటే ప్రభుత్వ భూములు ఇంకెక్కడా ఉన్నాయని మొత్తం టీడీపీ నాయకులే దౌర్జన్యంగా స్వాదినం చేసుకున్నారని నెటిజన్లు సమాచారం….