ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలావున్నా.. తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ పార్టీతో కలిసి ఎన్నికలకు పోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి వ్యతిరేకిస్తున్నట్లు తెలిసింది. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే భారీ నష్టం తప్పదని ఆమె హెచ్చరించినట్లు సమాచారం. ఇందులో బాగంగానే రాష్ట్ర విభజన అనంతరం చాలా సమస్యలు పరిష్కారం కాకపోవడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబే కారణమని విజయశాంతి ఆరోపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుంటే నష్టపోతామని విజయశాంతి మెదక్ జిల్లా కాంగ్రెస్ నేతల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది.ప్రస్తుతం చావో రేవో అన్నట్లుగా ఉన్న ఈ పరిస్థితుల్లో కొందరు పార్టీ నేతలు కాంగ్రెస్ అధిష్టానాన్ని తప్పుదోవపట్టిస్తున్నారని విజయశాంతి అన్నారంట.
