బాలీవుడ్ హీరోయిన్ నటి.. శిల్పాశెట్టి ధరించిన దుస్తులు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తన కుమారుడు వియాన్‌తో శిల్పా ధరించిన డ్రెస్ ప్రస్తుతం వివాదాస్పదమైంది. ఎందుకంటే శిల్పాశెట్టి కుర్తా ధరించి ఫ్యాంట్ వేసుకోలేదు. ఈ పోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో నెటిజన్లు ఆమెపై ట్రోలింగ్ ప్రారంభించారు. శిల్పా ఆంటీ మీరు ప్యాంటు ధరించడం మరచిపోయారా అంటూ సైటైర్లు వేస్తున్నారు. అయితే ట్రోలింగ్ ఆమెకు కొత్తేమికాదు. గతంతో కూడా ఆమె వేషధారణ సంబంధించి అనేకసార్లు విమర్శలపాలయ్యారు. ఇటీవల సరదాగా చేసిన పనికి కూడా ఆమెను నెటిజన్లు ఏకిపారేశారు. సరదాగా టార్చరింగ్ ఫిష్ అంటూ శిల్పా చేసిన పోస్ట్‌కు విమర్శలు వెల్లువెత్తాయి. ఒక అబ్బాయికి తల్లివై వుండి.. తన కుమారుడితో కలిసి వెళ్తూ ఇలాంటి దుస్తులు ధరించడం ఏమిటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
