మొన్న వచ్చిన భారీ వరదలకు ఇప్పుడుపుడే కోలుకుంటున్న కేరళకు పండుగ వచ్చింది…. కేరళలో జరుపుకొనే పండుగలలో అతి ముఖ్యమైన పెద్ద పండుగలలో ఓనమ్ కూడా ఒకటి. ఇక్కడ పండించిన పంట కోతకి వచిన్నపుడు రైతులు ఈ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. కానీ ఈ సారి సంభవించిన వరదలతో రాష్ట్రం అతలాకుతలమయ్యింది. కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న వరద బాధితులు ఘనంగా ఓనమ్ పండుగను ఆ నివాస కేంద్రాలలోనే జరుపుకుంటున్నారు. చెంగనూరులోని రిలీఫ్ క్యాంపులో.. ఓనమ్ ప్రత్యేక సంబరాలను నిర్వహిస్తున్నారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి, ప్రధాని మోడీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేరళ ప్రజలకు ఓనమ్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ నేపధ్యంలో తిరువనంతపురంలోని పద్మనాభస్వామి ఆలయాన్ని సందర్శించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు.దేశంలో ప్రతిఒక్కరు కేరళకు ఏవిధంగా సహాయపడ్డారో అదేవిధంగా మంచి మనసుతో వాళ్లకు ఓనమ్ శుభాకాంక్షలు తెలియజేయండి.