ప్రముఖ నటి, గాయని, ప్రస్తుతం కేంద్రలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యురాలు రూపా గంగూలీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత దేశం హిందువులదని రూపా గంగూలీ అన్నారు. భారత దేశ విభజన మతపరంగా జరిగిందని ,పాకిస్తాన్, బంగ్లాదేశ్ లు ముస్లిం లకోసం ఏర్పాటు అయినవని ఆమె అన్నారు. అంతేకాదు పశ్చిమ బెంగాల్ హిందువుల కోసం ఉద్దేశించినదని ఆ రాష్ట్రంలో బంగ్లా వలసదారుల వివాదం నేపధ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా విశ్వహిందూ పరిషత్ ఆద్వర్యంలో సెప్టెంబర్ రెండున పశ్చిమబెంగాల్ వ్యాప్తంగా కృష్ణాష్టమి ఉత్సవాలు జరుపుతున్నట్లు ప్రకటించింది.
