ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది . అధికారంలో టీడీపీ నుండి ప్రతిపక్ష పార్టీలోకి వచ్చే ఎన్నికల్లో ఏం జరుగుతుందో ఆసక్తి రేపుతుంది. తాజాగా వైసీపీలోకి మరో టీడీపీ నేత చేరబోతున్నారు. వైసీపీలోకి చేరేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకున్నారు. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, ప్రస్తుత టీడీపీ నాయకుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ గ్రంధి యానాదిశెట్టిని బుధ వారం కావలి పట్టణంలోని నమస్కార్ హోటల్‌లో కలిసి టిఫిన్ చేయడం కావలి రాజకీయాల్లో చర్చనీయాంశమయింది. గ్రంధి గత మున్సిపల్, అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం కృషి చేశారు. అయితే గ్రంధి తన కుమార్తెతో కలిసి టీడీపీలో చేరారు. వైసీపీ నుంచి టీడీపీలో వచ్చిన గ్రంధి యానాదిశెట్టికి పార్టీలో తగిన గుర్తింపు లేదని ఆయన కొంత అసంతృప్తిగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో రాబోవు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గ్రంధిని తిరిగి వైసీపీలోకి తీసుకుంటే బాగుంటుందనే భావాన్ని ఎమ్మెల్యే తన అనుచరుల వద్ద వెల్లడించినట్లు తెలిసింది. 30 ఏళ్లుగా కావలి రాజకీయాల్లో చక్రం తిప్పిన గ్రంధి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాను టీడీపీలో ఉంటే పరిస్థితి ఏంది…విజయవాకాశలు ఎక్కువగా ఉన్న వైసీపీలోకి పోతే ఎలా అనే దానిపై ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది.
