నాలుగేళ్ల చంద్రబాబు పాలనను ఎండకడుతూ.. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు, వైఎస్ జగన్‌కు రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. రోజు ఆయనతో పా వేలాది మంది అడుగులో అడుగు వేస్తున్నారు. వైఎస్ జగన్ చేపట్టిన ఈ ప్రజాసంకల్పయాత్రలో శుక్రవారం మరో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు జగన్ చేస్తున్న ప్రజాసంకల్పయాత్ర @2800 కిమీ: వెల్లువలా జనం వెంటనడువగా… విశాఖ జిల్లా యలమంచిలో వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర 2800 కిలోమీటర్ల మైలురాయిని దాటింది. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఈ మైలురాయికి గుర్తుగా ఒక మొక్కను నాటారు.
