క్యాలెండర్ లో రక్షా బంధన్ ఆదివారం అని సూచిస్తున్నా, పౌర్ణమి కూడా ఆ రోజే ఉన్నప్పటికీ ఆ రోజు రాఖీ కట్టడం ఏ మాత్రం మంచిది కాదు అని వేద పండితులు చెబుతున్నారు. పౌర్ణమి రోజున దనిష్ఠ నక్షత్రం ఉన్న కారణంగా కీడు జరుగుతుంది అని చెబుతున్నారు. ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం సూచిస్తున్నారు. శ్రావణ మాసం శ్రవణ నక్షత్రం ఎంతో శుభసూచికం. ఇది శనివారం రోజున సంభవిస్తుంది. కావున ఈ రోజు రాఖీ కట్టడం వలన ఎటువంటి లోపము జరగదని పండితుల మాట.