ఆయన దాదాపు పదేళ్ళుకుపైగా టీడీపీలో ఉన్న నేత.. అంతేనా రెండు సార్లు కౌన్సిలర్ గా .నాలుగేళ్ళుగా మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిలో ఉన్నారు.. అప్పుడు అధికారం లేనపుడు పార్టీకోసమే పని చేశారు. ఇప్పుడు అధికారమున్న కానీ ఏనాడు కూడా పార్టీకోసమే పని చేశాడు తప్పా తన స్వార్ధం కోసం పని చేయలేదు. అలాంటి నేత ఇప్పుడు టీడీపీకి గుడ్ బై చెప్పడానికి రెడీ అయ్యారు. ఇంతకు ఎవరు అని ఆలోచిస్తున్నారా.. ఆయనే విజయనగరం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత కాకి రంగ..ఈ రోజు శుక్రవారం పట్టణంలో జరగనున్న వైసీపీ విస్తృత సమావేశానికి హాజరు కానున్న మాజీ మంత్రి బొత్స సత్య నారాయణ సమక్షంలో వైసీపీ చేరడానికి రంగ సిద్ధమయ్యారు..
