తెలంగాణ రాష్ట్రంలో గత నాలుగున్నరేళ్ళుగా సాగుతున్న ప్రజరంజక పాలనకు ..అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం సఫలీకృతం అయిందన్నారు భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు .మంత్రి హారీష్ రావు సమక్షంలో సిద్దిపేట నియోజకవర్గంలోని నంగునూర్ మండలం అంకుశపూర్ గ్రామానికి చెందిన బూసిరెడ్డి నారోత్తం రెడ్డి ఆధ్వర్యంలో పలువురు బీజేపీ,టీడీపీ,కాంగ్రెస్ పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు,ఆయా పార్టీ కార్యకర్తలు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై సిద్ధిపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోకి నడిపిస్తున్న మంత్రి హరీష్ రావు పనితీరు పట్ల,ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వ పటిమకు ఆకర్షితులై గులాబీ గూటికి చేరారు.
ఈ సందర్భంగా మంత్రి హారీష్ మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు దేశానికే ఆదర్శం అని..టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజరంజక పాలన చేస్తోంది అని..ప్రజలు పాలను స్వాగతిస్తూ…సంతోషంగా ఉన్నారన్నారు.. సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు ఇతర పార్టీలు ఆకర్షితులు అవుతున్నారన్నారు…ప్రజా పాలనకే ప్రజలు పట్టం కడ్తారు అని చెప్పారు… టీఆర్ఎస్ లో చేరినవారిలో బూసిరెడ్డి రవీందర్ రెడ్డి,పాటూరి కిషన్,బూసిరెడ్డి వెంకట్ రెడ్డి, నర్మెట రామనుజం,పిల్లి మహేష్,బంధారం మధు ,బతిగంటి నరేష్,దేవులపల్లి హరికృష్ణ,బంద్రం మహేష్, పతురి శ్రీను, పిల్లి భాను, నర్మెట గణేష్, పంజల ప్రశాంత్,పినికేషి మహిపల్ రెడ్డి, మయోజ అరుణ్ కుమార్,బూసిరెడ్డి నర్సింహారెడ్డి, మయోజ బుచ్చి వీరయ్య, బూసిరెడ్డి మహేందర్ రెడ్డి, నర్మెట రమేష్, గోళ్లేన కొమురయ్య,నర్మెట సత్తయ్య, నర్మెట శ్రీను,బూసిరెడ్డి సంతోస్ రెడ్డి, బంధారం శ్రీనివాస్ఉన్నారు.
ఈ కార్యక్రమంలో నంగునూర్ ఎంపీపీ జాప శ్రీకాంత్ రెడ్డి గారు, జడ్పీ వైస్ చైర్మన్ రాగుల సారయ్య గారు, పార్టీ అధ్యక్షులు అనగోని లింగం గౌడ్ గారు,పీఏసీఎస్ చైర్మన్లు ఎడ్ల సోమిరెడ్డి గారు,కోల రమేష్ గౌడ్ గారు,సిద్దిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ వేముల వెంకట్ రెడ్డి గారు,ప్రణాళిక సంఘము సభ్యులు దువ్వల మల్లయ్య గారు, మాజీ సర్పంచులు బొంగోని శ్రీనివాస్,తుంగ కనకయ్య,వర్దోలు వేణు,బాలపోచయ్య,,యువజన నాయకులు రేకులపల్లి వెంకట్ రెడ్డి,ఆకుబత్తిని రాము,వడితం కిరణ్ కుమార్ నంగునూర్ మండల విద్యార్టీ విభాగం ప్రధాన కార్యదర్శి దాసరి రమేష్ తదితరులు ఉన్నారు…..