జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కంటికి కట్టుతో వెను భార్య ఉండి ఓ హాస్పిటల్ నుంచి బయటకు వస్తున్న ఫొటో వైరల్ గా మారింది. కారణం.. పవన్ కు రెండోసారి కంటి ఆపరేషన్ జరిగింది. గత నాలుగు నెలలుగా కంటి సమస్యతో ఇబ్బంది పడిన పవన్ కళ్యాణ్ జూన్ నెలలో హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి వైద్యులను సంప్రదించగా.. ఎడమ కన్నులో చిన్న కురుపు ఉందని గుర్తించిన వైద్యులు శస్త్రచికిత్స చేయాలన్నారు. కొన్నిరోజులు కంటిలో దుమ్ము, ధూళి పడకుండా నల్ల కళ్లద్దాలు వాడేవారు. అయినప్పటికీ నొప్పి ఎక్కువ కావడంతో గత నెల శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి వైద్యులు శస్త్రచికిత్స చేసి కంటిలో కురుపును తొలగించారు. అనంతరం మళ్లీ ఇన్ఫెక్షన్ రావడంతో మళ్లీ ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి వైద్యుల సలహా మేరకు పవన్ గురువారం మరోసారి కంటికి ఆపరేషన్ చేయించుకున్నారు. మరోవైపు పవన్ కంటికి ఆపరేషన్ చేయించుకున్న విషయం తెలియని చాలామంది అభిమానులు.. పవన్ కంటికి కట్టు వేయించుకున్న ఫొటోలు చూసి ఒక అంధుడికి అన్నయ్య చూపునివ్వాలని కంటిని దానం చేసేసారంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. నువ్వు చెప్తే మా కళ్లు ఇచ్చేవాళ్లం కదా అన్నయ్యా అంటున్నారు. ప్రస్తుతం పవన్ కంటి ఆపేషన్ ఇష్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
