ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ అవతరించింది. విశాఖ ఎంపీ కొత్తపల్లిగీత తన కొత్త రాజకీయపార్టీని ఈరోజే ప్రకటన చేశారు. పార్టీ పేరు జనజాగృతి పార్టీ అని పెట్టారు. విజయవాడలో ప్రెస్‌మీట్ నిర్వహించిన ఆమె ఈ ప్రకటన చేశారు. మార్పు కోసం ముందడుగు అనేది పార్టీ నినాదమని ఆమె చెప్పారు. పార్టీ జెండాను కూడా ఆమె విడుదల చేశారు. నీలం రంగు, తెలుపు రంగుతో కూడిన జెండాపై గొడుగు చిహ్నాన్ని ముద్రించారు. గత ఎన్నికలలో వైసీపీ తరపున అరకు నుండి పోటీచేసి గెలుపొందారు. అయితే ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఉండడంతో ఆమె టీడీపీలోకి జంపు చేస్తారనే ప్రచారం సాగింది. దానికి వైసీపీ క్రమశిక్షణ రాహిత్య చర్యలకు కూడా పూనుకోవాలని చూసింది. దీంతో టీడీపీకి కూడా దూరంగానే ఉన్నారు. బీజేపీలోకి వెళ్తారని ప్రచారం కూడా రాగా ఇప్పుడు ఏకంగా కొత్తపార్టీని స్థాపించారు.
పార్టీ పేరు జన జాగృతి పార్టీ, (మార్పుకోసం ముందడుగు)
ఏపీలో రాజకీయం రెండు కుటుంబాల మధ్యే కొనసాగుతుంది.
90% మంది మిగిలిన కుటుంబాలకు అన్యాయం జరుగుతోంది.
ఏపీలో మహిళలను ఎదగనీయకుండా అణగదొక్కుతున్నారు.
అందుకే సామాన్య ప్రజలకు న్యాయం జరగాలనే నేను పార్టీ పెడుతున్నా..
నేను 20 ఏళ్ల వయస్సులోనే ప్రభుత్వ ఉద్యగంలోకి వచ్చాను
లాస్ట్ గా డిప్యూటీ కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహించా
ప్రజా సేవలోకి వచ్చి ఎంపీగా గెలిచా.
తర్వాత ప్రజా ధనాన్ని నిరుపయోగం చేసిన పార్టీలకు దూరంగా ఉన్నాను.
జపాన్లు, సింగపూర్ లు తర్వాత కట్టుకోవచ్చు, ముందు సాధారన జీవనం బ్రతికేలా ఉండాలి.
ఏపీకి ఏదో చేస్తారని చంద్రబాబును సిఎం చేసాం ఏమైంది.
రాష్ట్రంలో అరాచకపాలన జరుగుతోంది
70 ఏళ్లై స్వాతంత్ర్య వచ్చినా ఇంకా ఏపీలో మంచి నీటి సమస్య ఇంకా ఉండటం బాధకారం.
జన జాగృతి పార్టీ 3% శాతం మహిళలకు టికెట్లు ఇస్తుంది.
మిగిలిన కులాల వారికి సమానంగా టికెట్లు ఇస్తాం
జన జాగృతి పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి ఎమ్మెల్యే మీద 6 నెలలకు సోషల్ ఆడిట్ చేయిస్తా
సమగ్రమైన మెనిఫెస్టోని జన జాగృతి పార్టీ త్వరలో ప్రకటిస్తా