టీఆర్ఎస్ పార్టీ అధినేత,ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన టీఆర్‌ఎస్ రాష్ట్ర కమిటీ, శాసనసభాపక్షం, పార్లమెంటరీ పార్టీ సంయుక్త సమావేశం ముగిసింది. ఈ కార్యక్రమానికి మంత్రులు,ఎంపీలు ,ఎమ్మెల్యేలు ,ముఖ్య నాయకులు హాజరయ్యారు.ప్రగతి నివేదన సభ విజయవంతం కావడానికి కమిటీల ఏర్పాటు, బాధ్యతలు అప్పగించడం, తాజా రాజకీయ పరిణామాలపైన సమావేశం జరిగింది.ఈ సందర్బంగా వచ్చే నెల 2 న జరగనున్న ప్రగతి నివేదన సభపై సీఎం కేసీఆర్ కీలక సూచనలు చేశారు. రానున్న ఎన్నికల్లో 101 శాసనసభా స్థానాల్లో విజయం సాధించానున్నట్లు తెలిపారు. దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో ప్రగతి నివేదన సభ విజయవంతం కావాలి. వేల సంఖ్యలో బస్సులు, ప్రైవేటు వాహనాలు, కార్లు, ట్రాక్టర్లను జన సమీకరణకు వినియోగించాలి. సెప్టెంబర్ నెలాఖరు, అక్టోబర్ మొదటి వారంలో అభ్యర్థులను ఖరారు చేస్తాం..” అని కేసీఆర్ చెప్పారు.సమావేశం అనంతరం కేసీఆర్ డిల్లీ కి పయనమై వెళ్లారు.