కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గం.. కేఈ కుటుంబానికి కంచుకోట అయిన డోన్ లో బుగ్గన 2014లో గెలిచారు. డోన్, ప్యాపిలి, బేతంచర్ల మండలాలున్నాయి. 2లక్షల 20వేల ఓట్లున్నాయి. డోన్ నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులు గెలిచారు.. నీలం సంజీవరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి గెలిచారు. త్రాగునీటి సమస్యలతో జనం అల్లాడుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యే కావడంతో ప్రభుత్వం నిధులు విడుదల చేయట్లేదు. పార్టీ పరంగా మంచి గ్రిప్ ఉంది. పార్టీలో స్పోక్స్ పర్సన్ గా బుగ్గనకు మంచి పేరుంది. మొదటిసారని ఎమ్మెల్యే అయిన బుగ్గన నాలుగేళ్లుగా తనదైన శైలిలో పనిచేస్తున్నారని సమాచారం. పార్టీ ఆరోపణలు, ప్రత్యారోపణలే కాకుండా స్టాటిస్టికల్ గా వ్యవహరిస్తుంటారు. అధికార పక్షాన్ని గట్టిగా నిలదీసే వ్యక్తులలో బుగ్గన కూడా ఒకరినేది తెలిసిన విషయమే.
అసెంబ్లీలో జీరో అవర్ లో మాట్లాడడం.. కొన్ని ప్రత్యేక, క్లిష్ట సమయాల్లో మీడియా ముందుకు రావడం ఆయన ప్రత్యేకతలు.. బుగ్గన పార్టీ కార్యక్రమాలతోపాటు నియోజకవర్గంలో ఎక్కువగా ఉంటారు. ఎప్పటికప్పుడు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై బుగ్గన సమీక్షలు నిర్వహిస్తుంటారు. ఆర్ అండ్ బీ, పంచాయతీ అధికారులతో సమావేశాలు నిర్వహిస్తారు. గతంలో బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డిని పిఏసీ ఛైర్మన్ గా ఎంపిక చేశారు. పిఏసి ఛైర్మన్ పదవి విపక్షానికి కేటాయించడం ఆనవాయితీగా వస్తుంది. అప్పటి వరకు పిఏసి ఛైర్మన్ గా ఉన్న భూమా నాగిరెడ్డి వైసీపీని వీడి టీడీపీలో చేరడంతో ఆయనస్థానంలో బుగ్గనను ఎంపిక చేశారు. సుదీర్ఘ విశ్లేషణలు, టీడీపీకి తన లెక్కలతో చుక్కలు చూపించడంతో బుగ్గనకు పేరుంది. టీడీపీపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వ్యతిరేకత, బుగ్గన కలుపుగోలుతనం, మరోవైపు ప్రత్యర్ధ టీడీపీలో బుగ్గనను రాజకీయంగా ఎదుర్కొనే నాయకుడు కూడా లేకపోవడం వచ్చే ఎన్నికల్లో ఆయన గెలుపునకు ఉపయోగపడతాయని నియోజకవర్గ ప్రజలు భావిస్తున్నారు.
మరో పక్క
ఏపీ లో ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ పై ఇంకా గడువు ముగియకముందే తీవ్రమైన వ్యతీరేకత వచ్చింది.అంతేగాక రాష్ర్టంలో ఎక్కడ చూసిన రౌడియిజం,గుండాయిజం,భూకభ్జాలు,సెటిలిమెంట్ లు చేస్తున్నారు.ప్రతి రోజు ఎక్కడో ఒక చోట తెలుగు తమ్ముళ్లు బయటపడుతునే ఉన్నారు.ఇక కర్నూలు జిల్లా డోన్ నియోజక వర్గం ఎక్కువగా ఉంది మున్సిపాలటీ టెండర్‌ల విషయంలో డోన్ లో తెలుగు తమ్ముళ్లు రౌడిల్లాగా ప్రవర్తించారు. టెండర్ వేయడానికి వచ్చిన వైసీపీ వర్గీయులపై ముకుమ్మడిగా దాడి చేశారు. అంతేగాక నియోజక వర్గంలో టీడీపీ నాయకులు చేస్తున్న ఆరాచకాలు,దోపీడీలు,హత్యలు అది ఏపీ ప్రజలందరికి తెలుసు. గత ఎడాదిలో జరిగిన పత్తికోండ వైసీపీ ఇన్ చార్జ్ నారయణ రెడ్డి హత్యతో సహా .అలాగే ముఖ్యంగా యువతకు ఇంత వరకు ఒక్క నిరుద్యోగునికి ఉపాది అవకాశం ఇవ్వలేదు.రైతులకు .మహీళలకు ఇలా ఏ ఒక్కటి రాకుండా టీడీపీ నాయకులే అడ్డుపడుతున్నారు.కారణం వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కి ఆ క్రెడిట్ పోతుందని ఎలాగైన ఏవి ఇవ్వకుండా చేస్తే ఎమ్మెల్యే ప్రజల్లో వ్యతీరేకత వస్తుందని అనుకున్నారు.కాని రాష్ర్ట ప్రజలందరికి తెలుసు డోన్ నియోజక వర్గం లో ఏమీ జరిగింది,ఏమీ జరుగుతుందని.బల్ల గుద్ది మరి చేబుతున్నారు. కేఈ ప్రతాప రెడ్డి మాత్రం ఖచ్చితంగా ఈసారి డోన్ లో గెలవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అధికార పార్టీపై వ్యతిరేకత, కేఈ కుటుంబం పట్ల ఉన్న వ్యతిరేకత, హత్యారోపణలతో వచ్చే ఎన్నికల్లో డోన్ నియోజక వర్గం నుండి 2019లో వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గెలుపు మరోసారి ఖాయం అంటున్నారు ఆ నియోజకవర్గ ప్రజలు.