తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. ఈక్రమంలో రాష్ట్ర ప్రజలపై వరాల జల్లు కురిపించారు. ఈ నేపథ్యంలో ఎస్సీ,ఎస్టీలకు గృహోపయోగానికి ప్రస్తుతానికి ఉన్న యాబై యూనిట్ల నుండి ఉచిత విద్యుత్ పరిమితిని నూటఒక యూనిట్ల వరకు పెంచుతున్నట్లు నిర్ణయం తీసుకున్నారు.
ఇందుకయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు.అంతే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పలు ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు ప్రభుత్వమే వేతనాలను చెల్లిస్తుంది. అక్కడితో ఆగకుండా పూజారుల పదవీవిరమణను యాబై ఎనిమిది నుండి ఆరవై ఐదేళ్ళకు పెంచుతున్నట్లు కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఇమామ్,మౌజమ్ లకు నెలకు రూ ఐదు వేలను ఇవ్వనున్నట్లు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అయితే ఈ పెంపు సెప్టెంబర్ మొదటి తారిఖు నుండి చెల్లిస్తామని తెలిపారు..ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయంతో తొమ్మిది వేల మందికి లబ్ధి చేకూరనున్నది..
అంతేకాకుండా రాష్ట్రంలోని 29 మినీ గురుకులాల్లో హెచ్ఎం/వార్డెన్ కు రూ.5వేల నుంచి రూ.21 వేలకు, సిఆర్టీలకు రూ.4వేల నుంచి రూ.15వేలకు, పీఈటీలకు రూ.4వేల నుంచి రూ.11వేలకు, అకౌంటెంట్ కు రూ.3,500 నుంచి రూ.10,000, ఎఎన్ఎంలకు రూ.4వేల నుంచి రూ.9వేలకు, కుక్స్ కు రూ.2,500 నుంచి రూ.7,500కు, ఆయాలకు రూ.2,500 నుంచి రూ.7,500కు, హెల్పర్ కు రూ.2,500 నుంచి రూ.7,500కు, స్వీపర్ కు రూ.2,500 నుంచి రూ.7,500కు, వాచ్ మెన్ కు రూ.2,500 నుంచి రూ.7,500కు పెంచుతున్నట్లు ఆయన ప్రకటించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై సంతకం కూడా చేశారు.