కౌశల్.. గత కొన్నేళ్లుగా టీవీ సీరియళ్లు, అడపాదడపా సినిమాల్లో నటిస్తూ వస్తున్నాడు.. ఇప్పటివరకూ కౌశల్ అంటే కేవలం ఒక చిన్న నటుడు మాత్రమే అని అందరూ అనుకున్నారు. కానీ అతనిలోని నిజమైన హీరో బిగ్ బాస్ లోకి వెళ్లాకే బయటకు వచ్చాడు.. అతని వ్యక్తిత్వంతో కోట్లాదిమంది అతనికి అభిమానులయ్యారు. బిగ్ బాస్ లో ఎవరైనా కౌశల్ ని టార్గెట్ చేస్తే కౌశల్ ఆర్మీ వారిని టార్గెట్ చేస్తోంది. ప్రస్తుతం అతనికి ఉన్న ఇమేజ్, ఫాలోయింగ్ చూస్తే స్టార్ హీరోలకు సైతం అసూయ కలుగుతుందనడంలో అతిశయోక్తి లేదు. టాలీవుడ్ లో బిగ్ బాస్ సీజన్ 2 రసవత్తరం గా కొనసాగుతుంది రోజురోజుకి షో పైన అంచనాలు ఎక్కువైపోతున్నాయి. కంటేస్టెంట్స్ కూడా ఒకరికి ఒకరు ఏమాత్రం తగ్గకుండ బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లను చేసుకుంటూ ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నారు. ఈ విషయంలో కౌషల్ కాస్తా ముందడుగులో ఉన్నారు. షో స్టార్ట్ అయిన మొదటిరోజునుండి కౌషల్ ఎవరిని పట్టించుకోకుండా తన గేమ్ తను ఆడుతూ హౌస్ లో తనకి ఎవరితో పడకపోయినా కూడా అందరితో మంచిగా నడుచుకుంటూ మంచి పేరుని సంపాదించుకున్నాడు. దానివలన హౌస్ లో అందరు కూడా కౌషల్ ని టార్గెట్ గా చేసుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజూ కౌషల్ చేసే పనులను వేలెత్తి చూపిస్తూ ఉంటారు .అయిన కూడా ఔషల్ ఏమాత్రం బయపడకుండా తన పని తను చేసుకుంటూ ఎంతో ప్లానుడ్ గా గేమ్ ఆడుతూ ముందుకు అడుగులు వేస్తున్నాడు. అయితే ముఖ్యంగా కౌషల్‌కు అంతకు ముందు వరకు పెద్దగా గుర్తింపు లేదు. కాని బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ మొదలైంది. కౌషల్ ఆర్మీ అంటూ ఒక పెద్ద సోషల్ మీడియా గ్రూప్ రన్ అవుతుంది. ఆ గ్రూప్‌లో ప్రతి రోజు వేలాది మంది కౌషల్‌కు మద్దతుగా పోస్ట్‌లు చేస్తూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఎలిమినేట్ లో అందర్ని బయటకు వచ్చేలా చేసింది కౌషల్ ఆర్మీ .. చూద్దాం మరి చివరకు బిగ్ బాస్ లో ఏదైనా జరగోచ్చు. ఏం జరుగుతుందో వేచి చూడాలి.
