ఏపీలో ప్రతి పక్ష వైసీపీ పార్టీలోకి భారీగా వలసలుల జరుగుతున్నాయి. అధికారంలో ఉన్న టీడీపీ నుండి ఎక్కువగా వలసలు జరగడంతో టీడీపీ నేతలు ఆందోలనలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏం జరుగుతందో అని ముందే బలంగా ఉన్న పార్టీ వైపు చూస్తున్నారు. తాజాగా వైఎస్ జగన్ సంకల్ప యాత్రలో భాగంగా కోటవుర ట్ల, పాయకరావు పేటకు చెందిన పలువురు టీడీపీ నాయకులు వైసీపీలో చేరారు. కోటవురట్ల మండలానికి చెందిన 200 మంది టీడీపీ నాయకులు మాజీ ఎమెల్సీ డి.వి.సూర్యనారాయణరాజు ఆధ్వర్యంలో మంగళవారం వైసీపీలో చేరగా వారిని సాదరంగా జగన్ ఆహ్వానించారు. వీరిలో గెడ్డమూరి రమణ, మునగాడ చిరంజీవి, మారయ్య, సీహెచ్ కొండలరావు, చెంగల చిన్నబ్బాయి, వి.అప్పారావు, బి.శ్రీను తదితరులు ఉన్నారు.
