తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు తో ప్రముఖ మెసేజింగ్ నెట్ వర్క్ యాప్ వాట్సాప్ సీఈఓ క్రిస్ డేనియల్స్ ఇవాళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో భేటీ అయ్యారు.ఈ సందర్బంగా హైదరాబాద్‌లో వాట్సాప్ కస్టమర్ సర్వీస్ ఆపరేషన్ల సెంటర్‌ను ప్రారంభించాలని సీఈఓ క్రిస్ డేనియల్స్ ను మంత్రి కేటీఆర్ కోరారు.దీనికి డేనియల్స్ సానుకూలంగా స్పందించారు.డేనియల్స్ వెంట ఫేస్‌బుక్ ఇండియా పబ్లిస్ పాలసీ డివిజన్ హెడ్ శివనాథ్ తుక్రాల్ కూడా ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్ తదితరులు పాల్గొన్నారు.
Chris Daniels, CEO of Whatsapp and @shivithukral, Head, Public Policy Division, Facebook- India called on Minister @KTRTRS in Hyderabad today. @jayesh_ranjan, Prl Secy, IT & Industries Dept and @KonathamDileep, Director Digital Media, ITE&C Dept participated in the meeting.1/2 pic.twitter.com/AGYYkUUVKx
— Min IT, Telangana (@MinIT_Telangana) August 23, 2018